
ఖమ్మం బ్యూరో :
ఖమ్మం జిల్లా జగ్గియ్య తండా గ్రామానికి చెందిన బోడా సుశీల భర్త బోడా శివ (28) ప్రేమ వివాహం చేసుకున్నారు. బోడ శివ కార్ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు వయస్సు (7) జన్మించాడు. గత కొంత కాలంగా వీధి రౌడీ షీటర్ వినయ్ లైంగిక వేధింపులకు గురి చేసి సుశీల ను హత్య చేశాడు. బోడా సుశీల భర్త బోడా శివ కుటుంబాన్నీ వైఎస్ఆర్సిపి నాయకులు పరామర్శించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకొని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు, నాయకులు గణపారపు మురళి బోడా శివ కుటుంబానికి 15 వేల రూపాయలను ఆర్థిక సాయం అందించారు. వైయస్సార్ సిపి పార్టీ మీ కుటుంబానికి అండగా ఉండమని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మర్రి దిలీప్ వైస్సార్ నరేష్, కార్తీక్, నాగ కైకొండే గూడెం, రాజేష్ అశోక్, దిలీప్, కార్తీక్, అరుణ్, పవన్, బాబు, అంజి కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.