పూలే జయంతి వేడుకల రాష్ట్ర కన్వీనర్‌గా బొల్లం లింగమూర్తి*
ప్రభుత్వ అధికారిక ఉత్సవ కమిటీలో కరీంనగర్ నేతకు చోటు
హైదరాబాద్:
మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 11న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అధికారిక ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా కరీంనగర్‌కు చెందిన తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు*
తమపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సవ కమిటీ చైర్మన్ వి.హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ కు లింగమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. బీసీల సమస్యల పరిష్కారం కోసం సాగిస్తున్న పోరాటాలకు గుర్తింపుగానే ఈ పదవి దక్కినట్లు ఆయన పేర్కొన్నారు.జయంతి వేడుకలను విజయవంతం చేయాలి.
* రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పూలే జయంతి ఉత్సవాల్లో ప్రజలు, బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొనాలి.
* మహాత్మా పూలే ఆశయాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలి.
* ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సజావుగా సాగేలా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.
