కలెక్టర్ ను కలిసిన నిర్మల, జగ్గారెడ్డి
- తాగునీటి సమస్యలపై సమీక్షా సమావేశం

సంగారెడ్డి :
సంగారెడ్డి మున్సిపాలిటీలో మంచినీటి సమస్యలపై చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యను శుక్రవారం కలెక్టరేట్లో కలిసి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో మంచినీటి సరఫరా జరగడం లేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఉండకుండా చూడాలన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ప్రతిరోజూ మిషన్ భగీరథ నుంచి 8.5 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
16 Jul 2026
