*దేశ రాజధానిగా భాగ్యనగరం కాగలదా?

హైదరాబాద్‌కు రాజధాని, సుప్రీంకోర్టును మార్చాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి

*దేశ రాజధానిగా భాగ్యనగరం కాగలదా?

హైదరాబాద్:

భారతదేశ భౌగోళిక, వ్యూహాత్మక, పాలనాపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిని దిల్లీ నుండి హైదరాబాద్‌కు మార్చాలని తెలంగాణ వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ సంఘం ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును సైతం హైదరాబాద్‌కు తరలించడం ద్వారా భారత న్యాయవ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి అభిప్రాయపడ్డారు.

*సుప్రీంకోర్టు తరలింపుతో చేకూరే ప్రయోజనాలివే..
హైదరాబాద్‌లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం వల్ల దేశానికి, ముఖ్యంగా సామాన్య ప్రజలకు బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అందులోని ముఖ్యాంశాలు:
 * *సామాన్యులకు చేరువగా న్యాయం:* దక్షిణాది రాష్ట్రాల ప్రజలు, పేదలు, అట్టడుగు వర్గాల వారు న్యాయం కోసం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దిల్లీకి ప్రయాణించడం ఆర్థికంగా, శారీరకంగా పెను భారంగా మారింది. హైదరాబాద్‌లో అత్యున్నత న్యాయస్థానం అందుబాటులోకి వస్తే సామాన్యులకు న్యాయం మరింత సులువుగా దక్కుతుంది.

 *నత్తనడకన సాగే కేసులకు చెక్:
దేశానికి మధ్యస్థంగా ఉండే కేంద్ర బిందువు వద్ద న్యాయ కార్యకలాపాలు సాగడం వల్ల విచారణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది ఏళ్ల తరబడి పేరుకుపోయిన వేలాది కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుంది.

 *ప్రాంతీయ సమానత్వం - వికేంద్రీకరణ:
దేశంలోని అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు కల్పించడంలో భాగంగా పాలనా, న్యాయ వ్యవస్థలను వికేంద్రీకరించడం ఎంతో అవసరం. ఇది 'న్యాయం అందరికీ సమానం' అనే నినాదానికి నిజమైన అర్ధాన్ని ఇస్తుంది.

 *అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి:
ఇప్పటికే ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో దూసుకుపోతున్న హైదరాబాద్, దేశ రాజధానిగా మరియు సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రంగా మారితే అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట, ప్రాముఖ్యత మరింత పెరుగుతాయి.

*చారిత్రాత్మక నిర్ణయానికి సమయం ఆసన్నమైంది!
పోరాటాల గడ్డ అయిన తెలంగాణ, దేశ ప్రగతికి చోదక శక్తిగా నిలిచే అన్ని అర్హతలను కలిగి ఉందని అల్లంపల్లి రామకోటి స్పష్టం చేశారు. దేశ సమగ్రతను మరింత బలోపేతం చేసేందుకు, భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలిపేందుకు ప్రధానమంత్రి ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
[19:57, 6/11/2026] +91 94405 08078: End

About The Author