ఘనంగా ప్రజా పాలన దినోత్సవం సంబురాలు
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క.
ములుగు జిల్లా :

బుదవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణం లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ ఉరఫ్ సీతక్క విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం మంత్రి అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు.
Read More సైన్స్ జీవితానికి ఉపయోగపడాలీ
About The Author
06 Dec 2025
