అల్ఫోర్స్ టైనీ టాట్స్ బతుకమ్మ సంబరాలు

కరీంనగర్ :

WhatsApp Image 2025-09-18 at 5.59.38 PM

పండుగ వాతావరణం సమాజంలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు.  వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో తెలంగాణ కళావైభవాన్ని చాటి చెప్పే  బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సంబరాలను చైర్మన్ జ్యోతి ప్రజ్వలన చేసి దుర్గ మాత చిత్రపటానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్తుందని, సమాజంలో ఆనంద ఉత్సవాలకు బీజం వేస్తుందని తెలిపారు. ఈ పండుగకు తెలంగాణ రాష్ట్రంలో  ప్రత్యేకత ఉన్నదని, ఈ పండుగ దేశ విదేశాల్లో రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించుకోవడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. పండగ పల్లె వాతావరణం కళ్లకు కట్టే విధంగా కళకు నిదర్శనమని అభివర్ణించారు. బతుకమ్మ పండుగ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పల్లె పాటలు, కోలాటాలని తెలిపారు. నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ బతుకమ్మ ఉత్సవాలు యొక్క వైభవం తరగకపోవడం పండుగ గొప్పతనమని అని చెప్పారు‌ ఇంటి ఆడబిడ్డగా కొలిచే బతుకమ్మను వాడ వాడలా, పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మహానగరాల్లో  మహిళలందరూ సమూహంగా ఏర్పడి దేదిప్యమానంగా బతుకమ్మ దీవెనలు వెల్లివిరిసే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని ఆశయంతో బతుకమ్మ ఉత్సవాలను చాలా వైబోపేతంగా నిర్వహించడం జరుగుతుందని  చెప్పారు. వేడుకలలో భాగంగా చిన్నారులు ఆడిన బతుకమ్మ విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రూపాలలో బతుకమ్మలను తయారు చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Read More రెండు కోట్ల రూపాయలతో పురాతన ఆలయం పునర్నిర్మాణం.....

About The Author