అనాథ గృహ విద్యార్థులకు అన్న వితరణ గావించిన చాపరాల కుటుంబసభ్యులు

అనాథ గృహ విద్యార్థులకు అన్న వితరణ గావించిన చాపరాల కుటుంబసభ్యులు

ఎల్బీనగర్:

చాపరాల పెద్దల సంస్మరణ దిన సందర్బంగా ఎల్బీనగర్ లో చిత్రా లేఅవుట్ అనాథ విద్యార్థి గృహంలో సమావేశం జరిగింది. సమావేశానికి ముందు అనాథ విద్యార్థులకు చాపరాల ఇందిర తన పెద్దల సంస్మరణగా అన్నదానం చేశారు. చాపరాల లక్ష్మీ నరసింహ దాసు - శృతకీర్తి, చాపరాల రాఘవమ్మ , చాపరాల శ్రీనివాస కుమారి, చాపరాల విజయకృష్ణల జ్ఞాపకార్ధంగా అనాథ విద్యార్థులకు ఈ అన్నదానం చేశారు.విద్యార్థులతో జరిగిన సమావేశంలో స్పెక్ట్, అవయవ దాన సభ్యులు మాట్లాడారు.శరీర దాన, అవయవ దాన తెలంగాణ ఉపాధ్యక్షులు పిట్టల అంజయ్య, ఉపాధ్యక్షురాలు చాపరాల ఇందిర అవయవదానం విల్లు రాసిన వి.నాగమణి స్పెక్ట్ కార్యకర్త ఏ. రజని, రచయిత 
ఆర్. చంద్రశేఖర రావులు మాట్లాడారు. అనాథ ఆశ్రమంలోని విద్యార్థులందరూ బాగా చదువుకుని ఈ ఆశ్రమానికి, మీ ఊరికి మంచి పేరు తేవాలని, మీరందరూ సైంటిస్టులు,డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు కావాలని, మంచిగా, శ్రధ్దగా చదవి ప్రయోజకులు కావాలని కోరారు.  విద్యార్థులు ప్రయోజకులై చదువుకోవడానికి కష్టపడే విద్యార్థులకు మీ వంతు ఆర్ధిక సాయం చేయాలని చెప్పారు. విద్యార్థులు అందరూ శ్రధ్దగా విన్నారు. చాపరాల శ్రీనివాస కుమారి ఇటీవల చనిపోతూ నేత్ర దానం, అవయవ దానం చేశారు. 40 సంవత్సరాల క్రితమే సియల్ఎన్ దాసు నేత్ర దానం  చేశారు.

About The Author