ఆత్మీయ మిత్రుడిని సన్మానించిన చిన్ననాటి స్నేహితులు
ఎల్బీనగర్:
హయత్ నగర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె లింగం గౌడ్ ను నాగోల్ జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థుల సంగం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నాగోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నతంగా ఎదిగిన తమ చిన్ననాటి మిత్రుడికి వారంతా ఆత్మీయ సన్మానం చేశారు. నాగోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతున్న పల్లె లింగం గౌడ్ నూతనంగా హయత్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభపరిణామం అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. భవిష్యత్తులో పల్లె లింగం గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం (నోసా) అధ్యక్షుడు కందికంటి కన్నా గౌడ్ ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ సలహాదారులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు బిల్డర్ జిలకపల్లి శ్రీనివాస్ రెడ్డి, అనంతుల శ్రీనివాస్ రెడ్డి, డప్పు రాజు, ఉపాధ్యక్షులు సిద్ధి రమేష్, బొడ్డుపల్లి సురేష్, కార్యనిర్వాహక కార్యదర్శి నాల్ల ఉమా మహేశ్వర గుప్తా ప్రతినిధులు నల్ల ప్రభాకర్, మునిందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, వర్కాల బాలరాజ్ మెండు వెంకటరెడ్డి, నాళ్ల రాజేష్ గుప్తా శ్రీనివాస్ గుప్తా, రాజు సార్, కందికంటి కుమారస్వామి, గడ్డం యాదయ్య, పవన్, ఎడ్ల బాబు, ఉమాపతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
