
సూర్యాపేట :
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల జయ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు పలువురు జాతీయ నాయకుల దేవతామూర్తుల వేషధారణలతో అలరించారు. భారతమాత తెలంగాణ తల్లి వేషధారణ లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన పలు సాంస్కృత కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జిల్లా పద్మ,బింగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు..