
సూర్యాపేట :
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రులలో పలు వ్యాధులతో చికిత్స పొందిన సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారికి 18 లక్షల రూపాయిలు విలువగల 35 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది అభాగ్యులు సకాలంలో చికిత్స పొందలేక ప్రైవేట్ ఆస్పత్రిలలో అప్పులు చేసి,ఖర్చు పెట్టుకున్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉందని ఆయన అన్నారు.పేదలకు ఖరీదైన శస్త్ర చికిత్సలను అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రజా ప్రభుత్వం హయాంలో ఆరోగ్య శ్రీ పరిమితిని పది లక్షలకు పెంచారని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలో 200లకు పైగా ఎల్ఓసి లను సహాయ నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా సహాయ నిధులు మంజూరు చేపించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, కోతి గోపాల్ రెడ్డి, చింతమల్ల రమేష్, తూముల సురేష్, ధరావత్ వీరన్న నాయక్, నాగుల వాసు,అబ్దుల్ రహీం, అనంతుల యాదగిరి,సిద్ధిక్, రావుల రాంబాబు, సాయి నేత, ఆలేటి మాణిక్యం,లక్ష్మీ మకట్ లాల్, తదితరులు పాల్గొన్నారు..