నిరుపేదలకు భరోసా 'సీఎం సహాయనిధి'

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన పారిజాత నర్సింహారెడ్డి.

నిరుపేదలకు భరోసా 'సీఎం సహాయనిధి'

బాలాపూర్:
అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కొండంత అండగా నిలుస్తుందని మాజీ మేయర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ డివిజన్ పరిధిలో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంగళవారం ఆమె లబ్ధిదారులకు అందజేశారు.

​ప్రభుత్వ సహకారంతో అండగా..
ఈ సందర్భంగా పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల సహకారంతో నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆపద కాలంలో వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

​లబ్ధిదారుల వివరాలు:
ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన ఇద్దరు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి.
​కుళ్ళ జంపయ్య: రూ. 40,000/-
​దేవరత్ నందిని: రూ. 60,000/-
వీరికి పారిజాత నర్సింహారెడ్డి స్వయంగా చెక్కులను అందజేసి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు బలింగని జంగయ్య, కోలన్ తిరుపతి రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, సామ భాస్కర్ రెడ్డి, సిరిగని సాయి, గిరి ముదిరాజ్, మసూద్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author