సహకారం ఎప్పటికీ ఉంటది

- డబ్ల్యూ జే ఐ జిల్లా కమిటీని సన్మానించిన అల్పోర్స్ నరేందర్ రెడ్డి

WhatsApp Image 2025-12-29 at 6.03.43 PM

కరీంనగర్ : 

వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (బిఎంఎస్ అనుబంధం)జిల్లా సంఘానికి తనవంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అల్పోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. 

సోమవారం కొత్తపల్లి మండలం అల్పోర్స్ ఈ టెక్నో పాఠశాలలో  వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జిల్లా నూతన అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డితో పాటు జిల్లా కమిటి సభ్యులు నరేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు..

ఈ సందర్బంగా నరేందర్ రెడ్డి అధ్యక్షుడు దారం జగన్నాథ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్,కోశాధికారి చిట్టిమల్ల మహేందర్,సంయుక్త కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డిలను సన్మానించారు.

అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. డబ్ల్యూజేఐ జిల్లా కార్యవర్గానికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. సంఘ నూతన కార్యవర్గం జర్నలిస్టుల సమస్యలతో పాటు ప్రజా ప్రయోగ కార్యక్రమాలు కూడా చేపట్టాలని ఆకాంక్షించారు.

About The Author