యోగా క్రీడాకారులకు అభినందన

వయోవృద్ధుల దినోత్సవ గోడ ప్రతి విడుదల 
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

WhatsApp Image 2025-11-12 at 6.48.00 PM (1)

కరీంనగర్ : 

Read More సకాలములో గుండె ఆపరేషన్ నిమిత్తమై "ఓ" పాజిటివ్ రక్తం అందజేత

రంగారెడ్డి జిల్లాలో  జరిగిన రాష్ట్రస్థాయి యోగాసనా క్రీడా పోటీలలో ఓవరాల్ చంపియన్షిప్ సాధించిన కరీంనగర్ జిల్లా క్రీడాకారులను జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అభినందించారు.  ఈనెల 9న రంగారెడ్డి జిల్లాలోని ఎస్ఎంపి అంతర్జాతీయ పాఠశాలలో తెలంగాణ యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కరీంనగర్ క్రీడాకారులు అద్వితీయ ప్రతిభ కనబరిచి 83 పాయింట్ల తో ఓరల్  ఛాంపియన్షిప్ సాధించారు.  ఈ పోటీలో ఐదుగురు స్వర్ణ పథకాలు నలుగురు రజత పథకాలు నలుగురు కాంస్య పథకాలు సాధించిన క్రీడాకారులను బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రస్థాయి యోగాలో జిల్లా కీర్తిని దశాబ్దాలుగా ఆధిపత్యాన్ని కొనసాగించడం విశేషం అన్నారు.  మిగతా క్రీడలతో పోలిస్తే యోగ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అని ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వాములు కావాలని అన్నారు.  జాతీయ స్థాయిలో సైతం జిల్లా క్రీడాకారులు పథకాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.  రెండు దశాబ్దాలుగా జిల్లా యోగా అసోసియేషన్ క్రీడాకారుల సంక్షేమమే లక్ష్యంగా ప్రణాళిక బద్ధమైన శిక్షణతోనే రాష్ట్రస్థాయిలో 16 సార్లు వరుస విజేతలుగా నిలుస్తు జాతీయ స్థాయిలో పథకాలు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు  జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు  నాగిరెడ్డి సిద్ధారెడ్డి గుంటి రామకృష్ణ  పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వి. శ్రీనివాస్ జిల్లా యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు కన్న కృష్ణ కోశాధికారి స్వరూప చారి,  కోచులు  వి. కిష్టయ్య పి పి పి మల్లేశ్వరి ఏ ఆనంద్ కిషోర్  తదితరులు పాల్గొన్నారు.

Read More గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.


వయోవృద్ధుల గోడప్రతి ఆవిష్కరణ
 అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని  పురస్కరించుకుని ఈ నెల 12 నుండి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. బుధవారం  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా వయో వృద్ధుల దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీయుత అశ్విని తానాజీ వాకడే, జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి యం.సరస్వతి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, సిడిపిఓలు, శ్రీమతి సనా జవేరియా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్,  వయో వృద్ధుల అసోసియేషన్ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, మోసం అంజయ్య, తొడుపునూరి ఆనందం, యం. లక్ష్మీపతి, వి.రామేశం, సామ నారాయణ, ఖాజా సర్వరొద్దీన్,  బండ సత్యయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read More రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి, అధికారులు

About The Author