విద్యుత్ కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
సిద్దిపేట:
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు విద్యుత్ ఆర్టిజన్ అన్ మాండ్ మరియు పీస్ రేటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గజ్వేల్ లోని విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు మద్దతు తెలిపి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో తాను చేసిన పాదయాత్ర మరియు అనేక సభలలో విద్యుత్ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతామని చెప్పి రేవంత్ రెడ్డి విద్యుత్ విద్యుత్ కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నారని, విద్యుత్ కార్మికులను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిత్యం వెలుగులో ఉంచే విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 20వేల మంది డివిజన్ కార్యాలయం ముందు ధర్నాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ కార్మికులను కూడా మోసం చేస్తున్నారని, ఇచ్చిన హామీ మేరకు ఆర్టిజన్ కార్మికులను వెంటనే విద్య అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులుగా విలీనం కానీ కార్మికులను ఆర్టిజన్లుగా విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు. టీజీ ఎస్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న అన్మాండ్ కార్మికులందరినీ ఆర్టిజెన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వాలు రెగ్యులరైజ్ ఎలా చేశాయో ప్రస్తుతం ఉన్న వారిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో విద్యుత్ కార్మికులు సంతోషంగా ఉంటే నేడు రేవంత్ రెడ్డి పాలనలో విద్యుత్ కార్మికులు ఆందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో విద్యుత్ కార్మికులతో రోడ్లను దిబ్బందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందనా రవీందర్, కౌన్సిలర్లు బొగ్గుల స్వప్న సురేష్, మామిడి శ్రీధర్, విద్యుత్ జేఏసీ ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ షాదుల్ పాషా, వైస్ చైర్మన్ రామగౌనీ రవికుమార్. గజ్వేల్ డివిజన్ సిరినేని భూపతి రాజు, గజ్వేల్ డివిజన్ కన్వీనర్ శ్రీధర్, డివిజన్ వైస్ చైర్మన్ యాదగిరి గౌడ్, ఖలీల్ భాషా, చంద్రం యాదవ్, కోశాధికారి కుంట కిషన్, జాయింట్ సెక్రటరీ శ్రావణ్ రెడ్డి, జహంగీర్, బుచ్చిరెడ్డి, బాలకిషన్, కరుణాకర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
