ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండా

డిసిసి అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి

ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండా

భారతశక్తి, :

ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామంలో ఉపాధిహామీ పనులను గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆశేల్లి విజేత - వాసుదేవ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్బంగా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి, పేద ప్రజలకు ఇబ్బందిగా మార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమంలో మేము సైతం అంటూ గ్రామ గ్రామాన ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి వారికి మేము అండగా ఉంటామని తెలుపుతూ మహాత్మా గాంధీ ఉపాధి చట్టం మార్పును ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదని, అందుకు ఉపాధి హామీ కూలీలతో సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుందని, మోడీ సర్కార్ మొండిగా వ్యవహరించి పేద ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కార్యక్రమాలను తీసుకురావద్దని గతంలో ఉన్న మాదిరిగానే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని డిమాండ్ చేశారు, అనంతరం కొక్కొండ గ్రామ సర్పంచ్ ఆశేల్లి విజేత - వాసుదేవ్ గౌడ్ 
మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేద ప్రజల కళ్ళలో ఆనందం, నెలకొన్నదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అందరూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పుట్టి విక్రమ్, మురాడి ప్రభాకర్, తలారి మల్లేష్, కె భాలేష్, రవి, యం ప్రసాద్, మరియు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురాడి యాదయ్య, దమ్మని సత్తయ్య, తలారి ప్రవీణ్, పాండు, మరియు ఉపాధి కూలీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About The Author