కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి
- బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి బడే నాగజ్యోతి
ములుగు జిల్లా :

రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో కాళేశ్వరంపైన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని 163 వ జాతీయ రహదారిపై బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి దిష్టిబొమ్మ దగ్ధం చేసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
నాగజ్యోతి మాట్లాడుతూ కెసిఆర్ సారథ్యంలో ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అత్యున్నత చట్టం సభ ఆయన తెలంగాణ అసెంబ్లీలోని నాలుగు కోట్ల ప్రజల హక్కులను రేవంత్ రెడ్డి కాలరాచాడని ఆమె తెలిపారు.
నిన్న అసెంబ్లీలో జరిగిందంతా తెలంగాణను బలిపెట్టి బనకచర్ల కోసం రేవంత్ ఆడిన బాగోతం తప్ప ఇంకోటి కాదని దియపట్టారు.
కాలేశ్వరంపై సిపిఐ విచారణ అనేది ఒక పార్టీ పైన జరుగుతున్న దాడి కాదు మొత్తంగా తెలంగాణను ఏడారిగా మార్చే విద్రోహ చర్యగా భావిస్తున్నామని అన్నారు, ఒక వైపు రేవంత్ మరోవైపు బాబు ఇంకోవైపు మోడీ ముగ్గురు కలిసి తెలంగాణను శాశ్వతంగా దెబ్బతీసే దుర్మార్గమైన కుట్రలు తెరతీశారని ఆరోపించారు. పాత బాస్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలకు బలి చేసేందుకేనని అన్నారు.
తెలంగాణ వరప్రదాయని కాలేశ్వరం ప్రాజెక్టును బలి చేసేందుకు బాబు తెరపైకి తెచ్చిన బనకచర్ల తోనే ఈ మొత్తం కుట్రలకు బీజం పడిందని తెలిపారు. ఒకవైపు బనకచర్ల ముప్పుతో పాటు ఇచ్చంపల్లి ని తెరపైకి తెచ్చి మొత్తంగా మేడిగడ్డను ముంచే కూతంత్రం చేస్తున్నారు. తెలంగాణ రైతుకు మరణ శాసనం రాయాలన్నది ముగ్గురు కలిసి ఆడుతున్న పన్నాగమని ఆమె అన్నారు.
కాలేశ్వరం కమిషన్ నుంచి సిబిఐ విచారణ దాకా ప్రతి దాని వెనక మోడీ చంద్రబాబు రేవంత్ ఈ ముగ్గురు హస్తం ఉందని ఆమె తెలిపారు.
ప్రియాంక గాంధీ సిబిఐ ఈడీలను ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి వారిని వేదించడానికి మోడీకి వాడుకుంటున్నారని నిలదీయలేదా.. అప్పుడు సిబిఐ తప్పు అయినప్పుడు ఇప్పుడు ఉప్పు ఎలా అవుతుందని, న్యాయస్థానాలపై నమ్మకం ఉందని కోర్టులో నిలబడి గోష్ నివేదిక రుచిగా చూపెట్టి బిఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తే పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
