లక్ష్మి ప్రియా కాలనీలో త్వరలో డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి..

లక్ష్మి ప్రియా కాలనీలో త్వరలో డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి..

హయత్‌నగర్:

 హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మి ప్రియా కాలనీలో ఏళ్ల తరబడి నెలకొన్న డ్రైనేజీ సమస్యకు మోక్షం లభించనుంది. కాలనీలో భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో, శుక్రవారం స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కాలనీవాసులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. పనుల ప్రారంభానికి ముందుగా పైప్‌లైన్ వేయాల్సిన మార్గాలను, డ్రైనేజీ స్థాయిలను (Levels) ఆయన నిశితంగా పరిశీలించారు.
​ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కాలనీలో మురుగునీటి సమస్యతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించామన్నారు. ఈ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి, నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పనులు జరిగే సమయంలో స్థానికులకు రాకపోకల ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
​ఈ కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, సంక్షేమ సంఘం ప్రతినిధులు పరశురాం, జి. నరేష్, మురళి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts