
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
భైంసా : కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ కోసం డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులు ప్రతి సంవత్సరం ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పని సరని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. గ్యాస్ వినియోగదారులు తమ కంపెనీ (ఇండియన్ ఆయిల్, హెచ్పీ, భారత్ పెట్రోలియం) మొబైల్ యాప్ ద్వారా ఈ-కేవైసీ (బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ) చేయించుకోవచ్చు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కు వెళ్లి.. లేదంటే సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ సేవలు ఉచితంగా అందుతాయి. కోసం పూర్తి వివరాల http://www.pmuy.gov.in/e-kyc.html వెబ్ సైట్ సంప్రదించవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో
ఒకసారి ఈ-కేవైసీ చేయించడం తప్పని సరి. ఏడాదికి గరి ష్ఠంగా 9 సిలిండర్లకు కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. అయితే 8, 9వ రీఫిల్ సబ్సిడీని బయోమె ట్రిక్ ధ్రువీకరణ పూర్తయ్యేంత వరకు కేంద్రం నిలిపి వేస్తుంది. మార్చి 31లోపు ఈ-కేవైసీ చేయించుకుంటే ఆ సబ్సిడీని తిరిగి చెల్లిస్తారు. లేదంటే ఆ రాయితీ శాశ్వతంగా రద్దవుతుంది. బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయకపోయినా గ్యాస్ సరఫరా నిలిచిపోదు. కానీ సబ్సిడీ రాదు. యాప్, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్, డెలివరీ బాయ్.. మూడింటిలో ఏదో ఒక పద్దతిని ఎంచుకుని ఈ-కేవైసీ పూర్తిచేసుకోవాలని అన్నారు.