
పత్తి రైతులు సిసిఐ లో పత్తి అమ్ముకొనుటకు ముందుగా కాపాస్ కిసాన్ ఆప్ తమ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి.
ముందుగా రైతు నమోదు చేసుకోని, తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. జిల్లాలోని మద్నూర్ లో గల జిన్నింగ్ మిల్లు కృష్ణా నాచురల్ ఫైబర్ జిన్నింగ్ మిల్లును ముందుగా సిసిఐ వారు ఎల్1 లో ఎన్నుకొన్నారు. కావున ముందుగా ఈ జిన్నింగ్ మిల్లు మాత్రమే కనబడుతుంది.
రైతులు స్లాట్ బుకింగ్ చేసి ఏ రోజు అనేది తేదీ పైన క్లిక్ చేస్తే ఆమోదం వస్తుంది. ఒక వేళ రైతులు చేసుకొని యెడల ఆ గ్రామం ఏఇఓ ల వద్దకు గానీ, మండల వ్యవసాయ అధికారుల వద్దకు లేదా జిల్లాలోని ఏ ఎమ్ సి ఎస్ వద్దకు వెళ్ళిన స్లాట్ బుకింగ్ చేస్తారు. దీనికి స్మార్ట్ ఫోన్ ఉండాలి. స్మార్ట్ ఫోన్ లేని యెడల సంబంధిత అధికారులు వద్దకు వెళ్తే రైతులకు ఒటిపి వస్తుంది. దానిని రైతులు అధికారులకు చెప్పిన యెడల వారు స్లాట్ బుకింగ్ చేస్తారు. రైతులకు మెసేజ్ రూపంలో ఆమోదం వస్తుంది. స్లాట్ బుకింగ్ లేకుండా సిసిఐ లో అమ్ముకోవడానికి వీలు లేదు. కావున పత్తి రైతులు సిసిఐ లో అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకోండి. 8% మాత్రమే తేమ ఉండేవిధంగా మంచిగా అరబెట్టుకుని రూ.8110/- ఎమ్ ఎస్ పి ధర పొందగలరని ఈ సందర్బంగా జిల్లా ప్రత్తి రైతులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.