ప్రశాంతంగా రెండవదశ ఎన్నికల ఓట్ల లెక్కింపు

సీపీ గౌష్ ఆలం

WhatsApp Image 2025-12-14 at 6.39.34 PM

​కరీంనగర్ : 

​కరీంనగర్ జిల్లాలో రెండవదశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శాంతియుత వాతావరణంలో కొనసాగుతోంది. కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం, రెండవదశ ఎన్నికలు జరుగుతున్న ఐదు  మండలాల్లోని పలు ఓట్ల లెక్కింపు కేంద్రాలను   ఆదివారం ప్రత్యక్షంగా సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భద్రతా చర్యలు పర్యవేక్షణ:
​ఎన్నికల నిర్వహణకు కేటాయించిన పోలీసు సిబ్బందిని, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ​ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు, సిబ్బందికి సూచించారు. ​ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని, సరిపడా బలగాలను కేటాయించామని సీపీ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

నిబంధనల అమలు:
​గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే 05 మండలాల పరిధిలో 163 సెక్షన్ (భారతీయ నాగరిక సురక్ష సంహిత) అమలులో ఉందని సీపీ స్పష్టం చేశారు. ఈ సెక్షన్ ప్రకారం, ఐదు (05) కంటే ఎక్కువ గుమిగూడుట నిషేధం అని తెలిపారు. అంతే కాకుండా, గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుట పూర్తిగా నిషేధం అని తెలిపారు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా కరీంనగర్ పోలీస్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని సీపీ గౌష్ ఆలం తెలిపారు. 

About The Author