మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి బీమా చెక్కును అందించిన సీపీ

ఉమ్మడి వరంగల్ బ్యూరో :

WhatsApp Image 2025-10-10 at 5.10.54 PM

రోడ్డు ప్రమాదం మరణించిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ కుటుంబానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా 5లక్షల ప్రమాద బీమా చెక్కును కానిస్టేబుల్ భార్య కీర్తీకి శుక్రవారం అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న పి. హతీరామ్ గత సంవత్సరం మే నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదం  లో కానిస్టేబుల్ హతీరామ్ మరణించాడు.

Read More లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

ఈ సందర్బంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం తరుపున అందజేయాల్సిన బెనిఫిట్ల ను  సకాలంలో అందజేసేందుకు తగు చర్య తీసుకోవాల్సిందిగా సీపీ అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్ యాకుబ్ బాబా, సహాయకుడు తులసి పాల్గొన్నారు. 

Read More నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా చూడాలి

About The Author