నేడు సూర్య పేటకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాక
సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట :
సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జి. వి.వి గార్డెన్ లో జరిగే సిపిఎం సూర్యాపేట జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరితో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి హాజరవుతున్నారన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాల నిర్వహించేందుకు కార్యకర్తలకు అవసరమైన సూచనలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరిస్తారని అన్నారు. అనంతరం ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించనున్నారని అన్నారు. ఈ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి సిపిఎం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
