నకిలీ ఎంఓయూలతో యువతకు వంచన.!

కాంగ్రెస్ ప్రభుత్వంపై కప్పాటి పాండురంగా రెడ్డి ధ్వజం

నకిలీ ఎంఓయూలతో యువతకు వంచన.!

హైదరాబాద్:

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉనికిలో లేని, నకిలీ కంపెనీలతో బూటకపు ఒప్పందాలు (MoU) కుదుర్చుకుంటూ తెలంగాణ యువతను నిలువునా వంచిస్తోందని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.

​అడ్రస్ లేని సంస్థలతో ఒప్పందాలా?
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడం కోసం, ఉనికిలో లేని సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం సిగ్గుచేటని పాండురంగా రెడ్డి మండిపడ్డారు. "అమెరికా పర్యటనలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతుందన్న 'స్వచ్ బయో' కంపెనీ, ఒప్పందానికి కేవలం రెండు వారాల ముందే పుట్టిందన్న విషయం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం" అని ఆయన ఎద్దేవా చేశారు. అడ్రస్ లేని కంపెనీలతో ఫోటోలకు ఫోజులివ్వడం తప్ప, క్షేత్రస్థాయిలో యువతకు లభించిన ఉపాధి సున్నా అని విమర్శించారు.

​నిజాయితీగా సమాధానం చెప్పాలి:

నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాస్తవదూరమైన ప్రకటనలతో మరోసారి మోసగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దొంగ ఒప్పందాల వెనుక ఉన్న అసలు వాస్తవాలను బయటపెట్టాలని, ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి, ఇప్పటికైనా చిత్తశుద్ధితో కూడిన పాలన అందించాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు.

About The Author

Related Posts