వినాయక నిమజ్జన ఊరేగింపులకు డీజేకీ అనుమతులు లెవు
చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించిన బోనకల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పొదిల వెంకన్న
ఖమ్మం :

బోనకల్ మండల పరిధిలోని గ్రామాల్లో వినాయక నిమజ్జనానికి డీజేకి ఎటువంటి అనుమతులు లేవని ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించి డీజేను పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని బోనకల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పొదిలి వెంకన్న హెచ్చరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయకుని నిమజ్జన ఊరేగింపులో రాజకీయాలకు సంబంధించిన పాటలుగాని, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో ప్రజలకు ఇబ్బంది కలిగించినా,గొడవలు పెట్టుకున్న చట్టపరంగా తీసుకుంటామన్నారు. నిమజ్జనానికి కేటాయించిన సమయంలోనే మాత్రమే ఊరేగింపును ముగించుకుని నిమజ్జనాన్ని ప్రశాంతంగా పూర్తి చేయాలని కోరారు. అత్యుత్సాహంతో అల్లర్లకు పాల్పడిన,బైకులతో రేసులు చేసిన, డీజే లను ఉపయోగించిన వెంటనే ఆ వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కొనసాగాలని మండలం మొత్తం పోలీస్ శాఖ పరిరక్షణలో ఉందని ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని ఎస్ఐ పొదిల వెంకన్న కోరారు.
