ఇంటర్ ఫలితాల్లో దీక్ష జూనియర్ కళాశాల ప్రభంజనం

  • స్టేట్ సెకండ్ ర్యాంకర్ గా ఎంపీసీ జూనియర్ విద్యార్థిని లేఖశ్రీ
  •  విద్యార్థులను అభినందించిన కళాశాల యాజమాన్యం
  • హర్షం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ బ్రహ్మనందరెడ్డి, మధుసూదన్ రెడ్డి

ఇంటర్ ఫలితాల్లో దీక్ష జూనియర్ కళాశాల ప్రభంజనం

సిద్దిపేట:
   
ఆదివారం వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట జిల్లాలోని దీక్ష జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించినట్లు ప్రిన్సిపాల్స్ బ్రహ్మనందరెడ్డి, మధుసూదన్ రెడ్డి  తెలిపారు.ఈ మేరకు కళాశాలలో పత్రిక విలేకర్లతో వారు మాట్లాడారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో లేఖ శ్రీ  470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి స్టేట్ రెండవ ర్యాంక్ సాధించగా మరో  75 మంది విద్యార్థులు 400 మార్కులు సాధించి వారి  ప్రతిభను చాటారన్నారు. జూనియర్ బైపీసి విబాగంలో గోనేపల్లి శ్రీజ 440 మార్కులకు గానూ 436 మార్కులు సాధించింది. అదే విభాగంలో 15 మంది పైగా 434 నుండి మొదలుకొని 421 మార్కులు సాదించారని పేర్కొన్నారు. ఇక సీనియర్ ఎంపీసీ విభాగంలో లింగంపల్లి శిరీష 1000 మార్కులకు గానూ 992 మార్కులు సాధించింది. ఆమెతో పాటు మరో 10 మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్ బైపీసి విభాగంలో కోర్మాణి భవాని 1000 మార్కులకు గానూ 984 మార్కులు  సాధించడంతో పాటు మరో 8 మంది విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధించి జిల్లాలో అగ్రగామిగా నిలిచినట్లు పేర్కొన్నారు. తమ కళశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం తరుపున శుభాకాంక్షలు తెలియజేశారు.WhatsApp Image 2026-04-12 at 19.39.15

About The Author