కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- సీఎం రేవంత్ రెడ్డితో కలిపించి గ్రామాలకు నిధులు వచ్చేలా కృషి చేస్తా

సంగారెడ్డి :
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సంగారెడ్డిలో మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గ్రామాలకు నిధులు ఇప్పించేలా కృషి చేస్తానన్నారు. అధికారంలో లేనప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కండువా కప్పుకొని తిరిగిన అభ్యర్థులను సర్పంచిగా నిలబెట్టి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయవద్దని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉన్న గ్రామాల్లో డబ్బులు లేని నిజమైన కార్యకర్తలను ఎంపిక చేయాలని ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఆర్థికంగా వారికి సహకరించి గెలిపించేలా కృషి చేయాలన్నారు. సోనియాగాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున కార్గే జాతీయ న్యాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి ఓట్లు అడగాలన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు 500 కే గ్యాస్ సన్న బియ్యం ఇందిరమ్మ ఇల్లు రెండు లక్షల రుణమాఫీ వారికి 500 బోనాస్ రేషన్ కార్డులు 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటి పథకాలు ఓటర్ల వద్ద వివరించి ఓట్లు అడగాలన్నారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమికి ప్రయత్నం చేసే కార్యకర్తలు నాయకులు ఎంతటి వారైనా క్షమించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మల సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గాన్ని పరిశ్రమల స్థాపనకు ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయన్నారు. ఇక్కడికి పరిశ్రమలు వస్తే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే భూములు తీసుకుంటామన్నారు. పరిశ్రమలు ప్రారంభమైతే ఈ ప్రాంత యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు. టీజీఐసీ చైర్ పర్సన్ నిర్మల సంగారెడ్డి పటాన్చెరువు నియోజకవర్గం లో పరిశ్రమల స్థాపన కోసం కృషి చేస్తున్నారని అన్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకు రానున్న మూడేళ్ల తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిర్మల పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్లు ముగ్గురు కలిసి చెప్పిన నిర్మల ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉంటుందన్నారు. నేను పోటీ చేస్తానని అనుకోవద్దు. నిర్మల నాయకత్వాన్ని అనుసరించాలన్నారు. ఆమెని ఆదరించాలన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా సీఎం రాజశేఖర్ రెడ్డి రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రిల సహకారంతో ఐఐటి పటాన్చెరు ఫోర్వే లైన్ అకోలా నాందేడ్ రోడ్ సంగారెడ్డికి మంచిరా నీళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇలా ఎన్నో మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చిన చరిత్ర మనది అన్నారు. మొన్న ఎన్నికల్లో నన్ను ఓటమిపాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి నిధులు తీసుకువస్తూనే ఉన్నాన్ని స్పష్టం చేశారు. ఈ విషయం నియోజకవర్గంలోని ప్రజలకు చెప్పాలన్నారు. నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలో ఎన్నికల కమిటీ సభ్యులుగా చర్యాల ఆంజనేయులు నిర్మల తోపాజి అనంత కిషన్ రామ్ రెడ్డి ప్రభు రఘు గౌడ్ లు ఉంటారన్నారు. ఎన్నికల విషయంలో ఈ ఆరుగురిని సంప్రదించాలని సూచించారు. నాలుగు మండలాల్లో పార్టీ అధ్యక్షులు వారి పరిధిలోని గ్రామాలను పర్యవేక్షిస్తారని జగ్గారెడ్డి నాయకులకు కార్యకర్తలకు స్పష్టం చేశారు.
