గీతంలో రక్షణ సాంకేతికతలో పురోగతి’పై చర్చాగోష్ఠి

- ఈనెల 18-19 తేదీలలో నిర్వహణ
- ముఖ్య అతిథిగా ఐఐటీహెచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్

WhatsApp Image 2025-12-12 at 5.33.22 PM

సంగారెడ్డి : 
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈనెల 18-19 తేదీలలో అంతరిక్ష శాస్త్రం, రక్షణ సాంకేతికతలో పురోగతి అనే అంశంపై రెండు రోజుల జాతీయ చర్చాగోష్ఠిని నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకురాలు (కన్వీనర్) ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతరిక్ష శాస్త్రం, రక్షణ సాంకేతిక పరిజ్జానాలలో ఉద్భవిస్తున్న ధోరణులు, ఆవిష్కణలు, సహకార అవకాశాలను చర్చించడానికి నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలను ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రొఫెసర్ ప్రీతి వివరించారు.ఐఐటీ హైదరాబాదులోని డీఆర్ డీవో-పరిశ్రమ-విద్యా సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (డీఐఏ సీవోఈ) డైరెక్టర్ డాక్టర్ జి. రామగురు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలియజేశారు. ఈ సెమినార్ ప్రారంభోత్సవంలో గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి. రామశాస్త్రి తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు.ఈ సెమినార్ ను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎండీ. అక్తర్ ఖాన్ సమన్వయం చేస్తారని కన్వీనర్ తెలిపారు. 

About The Author