బడంగ్‌పేట్ చెరువు కట్టపై 'నిర్మాణ వ్యర్థాల' తొలగింపు
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం
బడంగ్‌పేట్:
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో గురువారం నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల (C&D Waste)పై ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పెద్ద చెరువు కట్ట వద్ద ఉన్న రైతు బజార్ సమీపంలో పేరుకుపోయిన వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు.
రోడ్లపై వేస్తే చర్యలు తప్పవు
ఈ సందర్భంగా అధికారులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. నిర్మాణ వ్యర్థాలను రోడ్లు, ఖాళీ స్థలాలు మరియు చెరువు కట్టల వద్ద పడేయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, పురపాలక శాఖ కేటాయించిన వాహనాల ద్వారా రీసైక్లింగ్ ప్లాంట్‌లకు తరలించాలని సూచించారు.
చెరువుల సంరక్షణ అందరి బాధ్యత
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు డి.వైఈఈ (S.W.M) అభినయ్ కుమార్, ఏఈ గంగాప్రసాద్, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు నరసింహ, వి. యాదగిరి, ఎస్‌ఎఫ్‌ఏ మహేందర్ మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
13 Mar 2026
