ఇబ్రహీంపట్నంలో 56 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
రూ. 24.02 లక్షల విలువైన చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డ
ఇబ్రహీంపట్నం:
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలతో పాటు అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు మంజూరైన *రూ. 24,02,000* విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలు ఈ నిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాయం పొందిన లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్ చారి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పండుగల జయశ్రీ రాజు, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్ గౌడ్, విజయేందర్ రెడ్డి, శివలింగం గౌడ్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, మూల కిరణ్, మిర్యాల రాజశేఖర్, మారుతి చారి తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ చెక్కుల పంపిణీలో భాగస్వాములయ్యారు.
