మైనారిటీలకు సర్కారు భరోసా: రంజాన్ కానుకల పంపిణీ

మైనారిటీలకు సర్కారు భరోసా: రంజాన్ కానుకల పంపిణీ

ఎల్‌బీనగర్:

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మైనారిటీలకు అండగా నిలుస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో మంగళవారం రంజాన్ తోఫా పంపిణీని ఆయన ప్రారంభించారు.
​ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి మసీదు కమిటీకి సుమారు 250 రంజాన్ కానుకలను అందజేస్తున్నామని తెలిపారు. పండగ రోజున మసీదుల్లో ఇఫ్తార్ విందుల కోసం ప్రభుత్వం రూ. లక్ష వరకు ఆర్థిక సాయం అందిస్తోందని వెల్లడించారు. మైనారిటీలు సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
​సంక్షేమ పథకాలపై ఫోకస్
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని మధుయాష్కీ పేర్కొన్నారు. మైనారిటీ మహిళల స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్లు, రూ. 50 వేల ఆర్థిక సాయం, వాహనాల పంపిణీ వంటి పథకాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About The Author