జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల గోడప్రతులను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

WhatsApp Image 2026-01-01 at 7.44.23 PM

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా : 

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాతీయ రహదారుల భద్రత మాసోత్సవాలు -2026 కు సంబంధించి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు.
   
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి ఒకటవ తేదీ నుంచి 31 వ తేదీ వరకు జాతీయ రహదారుల భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. రోడ్డు భద్రత నియమాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగేలా రోజువారిగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ గోడప్రతుల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్టీవో దుర్గాప్రసాద్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, రవాణా శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author