ఐడిఓసి హాల్ లో జిల్లా పోషణ మాస ఉత్సవం కార్యక్రమం..

WhatsApp Image 2025-10-31 at 6.15.55 PM

కామారెడ్డి జిల్లా : 

Read More విద్యార్థులను బలిపశువులను చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వివాదం..

ఐడిఓసి హాల్ లో జిల్లా పోషణ  మాస ఉత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ముఖ్యఅతిథిగా, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ, జిల్లాలో పోషణలోపం లేని జిల్లాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. పోషణ లోపం కలిగిన ఉన్న చిన్నారులను ఆకలి పరీక్ష నిర్వహించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంలో  హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎస్ ఎస్ ఎఫ్ పి కార్యక్రమంలో 10 స్టెప్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లల అభివృద్ధి పర్యవేక్షణ మేరకు, ఎన్ హెచ్ టి ఎస్ యాప్ లో ఐసిడిఎస్ శాఖ వారు మరియు ఎమ్ సి హెచ్ పోర్టల్ లో ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళకి ఆరోగ్య పరీక్షల నిర్వహించి ఎమ్ సి హెచ్ పోర్టల్ లో  సకాలంలో ఎంట్రీ చేయాలి. ఎస్ ఏ ఎమ్,ఎమ్ ఏ ఎమ్ పిల్లలకి ఆరోగ్యానికి సంబంధించిన తగు సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. తర్వాత పోషణ మాసం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు,ఎమ్ ఎల్ హెచ్ పి లు,ఎమ్ పి హెచ్ ఎస్,ఏఐఎమ్ఎస్ అధికారులు , టీచర్లు తదిరతలు పాల్గొన్నారు.

Read More నేటి భారతం :

About The Author