కార్పొరేట్లకు కాదు_కార్మికులకు న్యాయం చేయండి

ఆవాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి జబ్బార్

  • ప్రజలను కాపాడండి_దేశాన్ని రక్షించండి-రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్
  • కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి-గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్య నాయక్

కార్పొరేట్లకు కాదు_కార్మికులకు న్యాయం చేయండి

వనపర్తి జిల్లా :

పాన్గల్ మండల కేంద్రంలో గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా లో సిఐటియు మండల కన్వీనర్ సూర్యవంశం రాము అధ్యక్షతన సమ్మె సమావేశం నిర్వహించారు, అనంతరం బస్టాండ్ చౌరస్తా దగ్గరికి ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేశారు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆవాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి జబ్బార్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్య నాయక్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్, సిఐటియు సీనియర్ నాయకులు జి వెంకటయ్య ను పాల్గొని, మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు అయినా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కార్పొరేటు శక్తుల లాభాలు చేకూర్చడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది కార్మిక వర్గంపై రైతాంగంపై గ్రామీణ వ్యవసాయ కార్మికులపై భారాలు వేస్తున్నది పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకోవచ్చింది దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వారితో కొట్లాడి సాధించుకున్న చట్టాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నది చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చేందుకు ఈ లేబర్ కోడ్ లు తీసుకువచ్చింది 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినంగా మార్చాలని చూస్తుంది వేతనాలు నిర్ణయించే పద్ధతిని చర్చల ద్వారా కాకుండా ఏకపక్షంగా నిర్ణయించే పద్ధతిని తీసుకువచ్చింది యూనియన్లలో గుర్తించే విషయంలో అనేక మార్పులు తెచ్చింది ఆయా పరిశ్రమల్లో అడ్వైజరీ బోర్డు తెస్తామని కోడ్ లో పొందుపరిచింది సామాజిక భద్రతపై దాడి చేస్తుంది పిఎఫ్ ఈఎస్ఐ చట్టాల్లో అనేక మార్పులు చేసి యజమానుల దయ దక్షిణాలపై కార్మికులు ఆధారపడేలా చేస్తుంది మహిళలను ప్రమాదకరమైన పనులలో రాత్రి వేళల్లో పని మరి చేయించవద్దని  గత చట్టాల్లో ఉన్నప్పటికీ నేడు వాటిని రద్దుచేసి  రద్దుచేసి పులుసులతో సమానంగా రాత్రింబవలు పనిచేయాలని పద్ధతిని తీసుకువచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది  కోసం భూములలో లాక్కోవడానికి తెచ్చిన మూడు నల్ల చట్టాలను రైతులు పోరాటం వల్ల ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చినప్పటికీ ఇతర రూపాలలో రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తుంది విత్తన చట్టం 2025 ముసాయిదా విద్యుత్తు సవరణ బిల్లు విబిజి రాంజీ చట్టం ఇతర చట్టాలలో ముందుకు తెచ్చింది ఇప్పటికి వ్యవసాయరంగం సంక్షోభంలోనే ఉంది దీని ఫలితంగా జీవనోపాధి కోసం నగరాలకు వలసలు పెరుగుతున్నాయి నేడు జాతీయ వ్యవసాయం మార్కెట్ ముసాయిదా పత్రం ద్వారా రద్దయిన చట్టాలలోని అంశాలను ముందుకు తెస్తూ రైతాంగం పై దాడి చేస్తున్నది స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు కట్టపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది ఈ విధానాల ఫలితంగా ఏటా పదివేల మంది రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి వాటి సవరణకు కనీసం మద్దతు ధర చట్టం తేవాలని అనే రసాలు విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం పెరచెను పెడుతున్నది కార్పొరేటర్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు వివిధ ట్యాక్సీ ల పేరుతో రద్దు చేస్తున్నది ప్రభుత్వం రైతాంగానికి మాత్రం రుణమాఫీ చేయడానికి చేతులు రావడం లేదు అందుకే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామని అన్నారు, కార్మికులు. రైతులు. ఉపాధి కూలీల. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం వాళ్లకి అండగా ఉండి బీజేపీ వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో, రేమద్దుల సర్పంచ్ నిరంజన్, రైతు సంఘం నాయకులు భాస్కర్, మల్లేష్, నాయకులు, భీమయ్య, కిన్నె వెంకటయ్య, అంగన్వాడి యూనియన్ నాయకులు శారద. రాధ. మాధవి. వరలక్ష్మి. పద్మ. సరిత. ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు. మహేశ్వరి., శ్యామల, రేణుక, ప్రమీల గోవిందమ, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు, ఎల్లయ్య రంగస్వామి నాగన్న సుగ్రీవుడు అర్జునయ్య యాదగిరి చందు లాల్య, శాంతయ్య, శాంతమ్మ, ఎల్లమ్మ కృష్ణమ్మ, వివిధ రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు.

About The Author

Related Posts