సీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగొద్దు

- నర్మెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ 
- అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలని సూచన
- జిల్లా కలెక్టర్ కె. హేమావతి

సీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగొద్దు

సిద్దిపేట: 

 రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, విజయ ఎండి చంద్రశేఖర్ రెడ్డి లతో కలిసి నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్ ఫామ్  ఫ్యాక్టరీని మంగళవారం  జిల్లా కలెక్టర్ కె. హేమావతి సందర్శించారు.ఈ నెల 
22వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభించడానికి అవసరమైన హెలిప్యాడ్ ఏర్పాటు, బహిరంగ సభా స్టేజ్ ఏర్పాటు, రైతు మేళాకు స్టాళ్ల ఏర్పాటు, ఫ్యాక్టరీ ప్రారంభానికి ఫ్యాక్టరీలో చేస్తున్న ఏర్పాట్లు తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా వివిధ శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. హెలిపాడ్ ఏర్పాటు, బహిరంగ సభ, ఫ్యాక్టరీ ప్రారంభం, స్టాళ్లు, శిలాపలకం ఆవిష్కరణ తదతర అన్ని కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం  ఉండాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని, అధికారులు సూచించిన విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలనీ అన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి మాట్లాడుతూ  రాష్ట్రంలోని రైతులందరికీ ఉపయోగపడే గొప్ప కార్యక్రమం  ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవమని అన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభంతో పాటు  రైతు మేళాకు వచ్చే వేలాదిమంది రైతులు ఆయిల్ ఫామ్  తోటల పెంపకం పొందే ప్రయోజనాలను, వ్యవసాయ యాంత్రికరణ, పాడి పరిశ్రమ, పశువుల పెంపకం వలన కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉన్నందున సంబంధిత అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, వ్యవసాయ, ఆర్టికల్చర్, ఆర్ అండ్ బీ, పోలీస్, ఆయిల్ళ్ ఫెడ్, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-03-17 at 19.47.30WhatsApp Image 2026-03-17 at 19.47.30 (1)

About The Author