రేపు మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ‘మందు’ బంద్
శ్రీరామనవమి పండుగ దృష్ట్యా సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు
నేరేడ్‌మెట్:
శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రేపు (మార్చి 27న) ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ కమిషనర్ అవినాష్ మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పండుగ పూట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వైన్ షాపులు, బార్లు క్లోజ్
కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, మిలిటరీ క్యాంటీన్లను నిర్ణీత సమయం వరకు మూసి ఉంచాలని సీపీ స్పష్టం చేశా అయితే, స్టార్ హోటళ్లు మరియు గుర్తింపు పొందిన (రిజిస్టర్డ్) క్లబ్‌లలోని బార్లకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని నోటిఫికేషన్‌లో వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం, 1968లోని సెక్షన్ 20 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సీపీ తెలిపారు. ప్రజలందరూ ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని, నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ ఓలు, ఏసీపీలకు ఆదేశాలు వెళ్లాయి.
About The Author
27 Mar 2026
