రెండేళ్ల పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యం.
- హామీలను అడిగితే బూతులందుకుంటున్న ముఖ్యమంత్రి.
- ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద శర్మ విమర్శ
ఎల్బీనగర్:
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యమని మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు.రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72 వ పుట్టినరోజు పురస్కరించుకొని మురుకుంట్ల అరవింద్ శర్మ పేదలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళలకు 2000 పెన్షన్, రైతుబంధు, రైతు భరోసా, కేసిఆర్ కిట్టు లాంటి పథకాలు ఇచ్చి పేద ప్రజలను ఆదుకున్నారని అన్నారు. 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కాలం వెల్లబుచ్చుతున్నాడని అన్నారు. హామీలపై కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులందుకుంటున్నాడని అన్నారు. 6 గ్యారంటీలు కూడా అమలు చేయలేని అసమర్ధ ప్రభుత్వం అని అన్నారు. నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలని ఇస్తానని హామీ, వృద్ధులకు 4వేల రూపాయల పెన్షన్, రైతు భరోసా, రైతుల యూరియా కష్టాలు, కరెంటు కోతలు ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. మళ్లీ సుపరిపాలన రావాలంటే కేసిఆర్ తోనే సాధ్యమని అన్నారు. కేసిఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దాదాపు మహిళలకు వెయ్యి చీరలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, రామాచారి, గొడుగు శ్రీనివాస్, న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, కొండ్ర శ్రీనివాస్,కంచర్ల శేఖర్, పటేల్ సునీత రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్యాం సుందర్ గుప్తా, శ్రీమన్నారాయణ, పెంబర్తి శ్రీనివాస్, రమేష్ కుర్మా, బి. భూపాల్ రెడ్డి, వల్లూరి రమేష్, ఇస్మాయిల్ వాజిద్ పటేల్, సంతోష్, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
