భావితరాలకు మనం అందించే అతి గొప్ప ఆస్తి విద్య.....
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కేజీబీవీ విద్యార్థులకు ప్లే గ్రౌండ్ అందించేందుకు కృషి
కొక్కిరేణి గ్రామంలో 7 కోట్ల 21 లక్షలతో అభివృద్ధి పనులు మంజూరు
తిరుమలయపాలెం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం ప్రతినిది :
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేజీబీవీ తిరుమలాయపాలెం మరమ్మత్తు పనులకు 61 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నామని, డైనింగ్ హాల్, గ్రిల్, దోమల తెర, మొదలగు మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చూడాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
తిరుమలాయపాలెంలో ఐటిఐ ప్రభుత్వం మంజూరు చేసిందని, దానిని మెయిన్ రోడ్డు వద్ద షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడ భూమి దొరికితే, ఇక్కడ ఖాళీగా ఉండే మూడు ఎకరాలు కేజీబీవీ ప్లే గ్రౌండ్ కోసం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిన్నారుల బాధలు గమనించి 40 శాతం డైట్ చార్జీలు,200 శాతం కాస్మోటిక్స్ చార్జిల పెంచడం జరిగిందని అన్నారు. భావితరాలకు అందించే ఆస్తిగా పరిగణించి విద్య, వైద్యం రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.
22 నెలల కాలంలో కొక్కిరేణి గ్రామంలో అభివృద్ధి పనులకు 7 కోట్ల 21 లక్షల రూపాయలు మంజూరు చేసిందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం సమ ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. రైతులకు రెండు లక్షల వరకు పంట రుణమాఫీ పూర్తి చేసామని , రైతన్నలకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్, రైతు భరోసా క్రింద 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని అన్నారు.
గత ప్రభుత్వం పేదలకు సొంతింటి కార్యక్రమం విస్మరిస్తే ప్రజా ప్రభుత్వంలో మొదటి సంవత్సరం 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేశామని, కొక్కిరేణి గ్రామంలో మొదట విడత 34 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, మిగిలిన అర్హులకు రాబోయే 3 విడతల్లో ఇందిరమ్మ ఇండ్లను తప్పనిసరిగా మంజూరు చేస్తామని అన్నారు. ప్రతి సోమవారం లబ్ధిదారులకు ఖాతాలలో ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి చైతన్య జైని, ఆర్ అండ్ బి ఎస్ఈ యాకోబు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
