ఇస్నాపూర్ పరిధిలో 4 నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటుకు కృషి..
- లో వోల్టేజ్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు
- పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు:
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజలకు లో వోల్టేజ్ సమస్య ఉత్పన్నం కాకుండా నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇస్నాపూర్ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
నూతనంగా కర్దనూర్, వెలిమల తాండ, నాగులపల్లి డబుల్ బెడ్ రూమ్ సముదాయం, పాశమైలారం పరిధిలో ఔట్ డోర్ సబ్స్టేషన్ల ఏర్పాటు కోసం త్వరలో రెవెన్యూ అధికారులతో చర్చించి స్థలాలు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ముత్తంగి పరిధిలో ఇండోర్ సబ్ స్టేషన్ కోసం సైతం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
లకడారం పరిధిలో నిర్మిస్తున్న నూతన సబ్ స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయని.. త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు.
ఈ సమావేశంలో డిఈ నెహ్రూ నాయక్, ఏడిఈ తులసీ రామ్, తదితరులు పాల్గొన్నారు.
