వయోవృద్ధులు భవిష్యత్తుకు పునాది లాంటివాళ్ళు
డిడబ్ల్యుఓ తుల రవి

ములుగు జిల్లా ప్రతినిధి :
వయోవృద్ధులుసమాజంలో భవిష్యత్తుకు పునాది లాంటి వాళ్లు, వారిని గౌరవిస్తూ హక్కులను కాపాడాలని జిల్లా సంక్షేమ అధికారి తుల రవి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల తో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి నుండి కలెక్టరేట్ వరకు వయోవృద్ధుల హక్కులు, సంక్షేమం పై అవగా ర్యాలీని నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో వయో వృద్ధులైన తల్లితండ్రులను పట్టించుకోని వారసుల నుండి పట్టాలను రద్దు చేసి మళ్లీ తిరిగి ఆ వయోవృద్ధులైన తల్లితండ్రుల పేరు మీదనే పట్టాలను మంజూరీ చేయడం జరిగిందని అన్నారు. వయోవృద్ధులపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ తరపున వయోవృద్ధులకు వివిధ అంశాల్లో క్రీడా పోటీలు, కవితా పోటీలు వంటివి ఏర్పాటుచేయడం జరిగిందని, వీటివల్ల వయోవృద్ధుల శారీరక, మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు & పోటీలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. మాకు అన్ని విధాలుగా సహకరించి ఈ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తుల రవి తెలిపారు. ముందుగా జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ తరపున మెడికల్ క్యాంపు ఏర్పాటుచేసి వయోవృద్ధులకు పరీక్షలు నిర్వహించి అనంతరం మందులు పంపిణీ చేశారు.
