రాష్ట్రానికి గవర్నర్ అయినా మర్చిపోని స్నేహబంధం

హైదరాబాద్ :
ఒకరేమో రాష్ట్రానికి గవర్నర్ మరొకరు సీనియర్ పాత్రికేయుడు. పాత పరిచయాలు మర్చిపోకుండా స్నేహితుడి ఇంటికి ప్రత్యేకంగా వెళ్ళి తన మిత్రుడి కుటుంబసభ్యులతో కొంత సమయం గడిపి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా కాలక్షేపం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. కానీ మాజీ ఎమ్మెల్యే, త్రిపుర రాష్ట్ర గవర్నర్, అయిన ఎన్. ఇంద్రసేనారెడ్డి దృష్టిలో ఇది ఒక మామూలు విషయం. తన మిత్రుడు, సీనియర్ పాత్రికేయుడు అయిన దరూరి కమలాకరాచార్య ( కమల్) ను హైదరాబాద్ పర్యటనలో భాగంగా వ్యక్తిగతంగా కలసి కాసేపు ముచ్చట్లు పెట్టారు. అలాగే వాళ్ళ కుటుంబసభ్యులను పేరుపేరునా పలకరించి వారితో కాసేపు సమయం గడిపారు. తన పర్యటనను పురస్కరించుకుని అక్కడకు వచ్చిన అందరినీ కలిసి యోగక్షేమాలు అడిగారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు కమలాకరాచార్య (కమల్), భారతశక్తి ఎడిటర్ కేసారం పెంటారెడ్డి మరియు ప్రత్యేక ప్రతినిధి చింతలపాటి శ్రీనివాస్ త్రిపుర రాష్ట్ర గవర్నర్ ను శాలువాతో సత్కరించి తిరుపతి బాలాజీ చిత్రపటాన్ని బహుకరించారు.
