ఉద్యోగ సాధనకు నైపుణ్యాలే కీలకం: నిపుణుల వెల్లడి

ఉద్యోగ సాధనకు నైపుణ్యాలే కీలకం: నిపుణుల వెల్లడి

గజ్వేల్:

గజ్వెల్ లో స్థానిక టివైఆర్  లైబ్రరీ, నాలెడ్జ్ సెంటర్‌లో ఆదివారం ‘స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ జాబ్స్ అండ్ ప్లేస్‌మెంట్స్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన గణిత శాస్త్ర అధ్యాపకురాలు, మాజీ ప్లేస్‌మెంట్ హెడ్ జె. రాగసుధ, జె. శివ సాయినాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొని అభ్యర్థులకు మార్గనిర్దేశం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, ఇంటర్వ్యూలను ఎదుర్కొనే విధానం, ప్లేస్‌మెంట్స్ సాధించే పద్ధతులపై వివరించారు.ఈ సందర్భంగా జిఎంఆర్  గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ వంటేరు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పట్టుదలతో శ్రమిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమేనని యువతను ప్రోత్సహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, నిరుద్యోగ యువత టివైఆర్  లైబ్రరీ వనరులు తమ సిద్ధతకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-19 at 19.32.50

About The Author