కంటి శస్త్ర చికిత్స శిబిరం విజయవంతం

WhatsApp Image 2025-10-29 at 6.52.47 PM

ములుగు జిల్లా : 

Read More భూ నిర్వాసితులపై చిన్న చూపు చూస్తున్న సింగరేణి యాజమాన్యం.

ములుగు జిల్లా వ్యాప్తంగా పది రోజులుగా సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పొర శస్త్ర చికిత్స శిబిరం విజయవంతంగా ముగిసింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పి. హాజరై భాగస్వామ్యమైన సినీనటుడు సంజోష్ ను అభినందించారు.

Read More గ్రామ పంచాయతీలకు జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

సంజోష్ ఫౌండేషన్, శంకర నేత్రాలయ మెసు  హైదరాబాద్ విజన్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్ ఫౌండర్ రాచుపల్లి ఉపేంద్ర సహకారంతో ఈ శిబిరాన్ని ములుగు జిల్లా,ఏటూరునాగారం మండలంలోని గిరిజన భవన్ లో నిర్వహించారు.
 జిల్లా వ్యాప్తంగా ప్రజలు విస్తృతంగా స్పందించి, దాదాపు వెయ్యి మంది ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. అందులో 168 మంది రోగులకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించారు.

Read More నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా చూడాలి

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ తన స్వస్థల ప్రజల కోసం సంజోష్ ఇంత విలువైన సేవా కార్యక్రమం చేపట్టడం నిజంగాప్రశంసనీయంప్రస్తుతం చాలామంది తమ ఊరిని మరిచిపోతున్న వేళ, సంజోష్ లాంటి యువత తమ ప్రజల కోసం కృషి చేయడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ శంకర నేత్రాలయ వైద్యులను శాలువాలతో సత్కరించి, ఆశ వర్కర్లకు రూ.15 వేల చెక్కును సంజోష్, రాచుపల్లి ఉపేంద్ర చేతుల మీదుగా అందజేశారు.

Read More నేటి భారతం :

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ శంకర్, సి.ఐ ఏటూరు నాగారం అనుముల శ్రీనివాస్, ఏటూరు నాగారం ఎస్.ఐ రాజ్‌కుమార్, పోలీస్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read More ఓటరు మహాశయా ఒక్కసారి ఆలోచించు..

About The Author