యూరియా కొరకు రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు
సంగారెడ్డి :
- జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్
- రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తాం.

యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారి డా '' శివప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలో యూరియా సరఫరా జరుగుతున్న తీరుపై వ్యవసాయ శాఖ అధికారులు, పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని తెలిపారు . జిల్లా లో 38873 మెట్రిక్ టన్నుల యూరియాకి ఇప్పటివరకు 31111 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు ఆయన తెలిపారు.మండలాలలో 514 మెట్రిక్ టన్నుల యూరియా డీలర్ల వద్ద నిల్వ ఉండగా, మార్కుఫైడ్ శాఖ వద్ద బఫర్ స్టాక్ యూరియా 333 ఉన్నట్లు తెలిపారు. జిల్లాకు 6912 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉందన్నారు. ఈ నెల ఆఖరి వరకు యూరియా సరఫరా అవుతుందని తెలిపారు. రైతులకు జిల్లాలోని అన్ని వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు రైతులకు టోకెన్లు అందజేసి యూరియా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టోకెన్లు తీసుకున్న రైతులకు మాత్రమే డీలర్లు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు.
