రైతులు పంట వివరాలను నమోదు చేసుకోవాలి : ఏఈఓ హరీష్
ములుగు జిల్లా ప్రతినిధి :

ములుగు క్లస్టర్ పరిధిలోని రైతులు ఏఈఓ వద్ద పంట వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి ఎల్ హరీష్ ఆదివారం తెలిపారు. రైతులకు సంబంధించిన భూమి ప్రతి సర్వే నెంబర్ ,ప్రతి గుంటలో ఏఏ పంట పండిస్తున్నారు అనేది సంబంధిత ఏ ఈఓ ను సంప్రదించి పంట రకం వివరాలను, విస్తీర్ణం నీటి వసతి, ఇతర వివరాలు తప్పకుండా తెలుపాలన్నారు. పంట ఉత్పత్తులు పత్తి, వడ్లు, మొక్కజొన్న, ఇతర కోనుగోలు సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండ, గతంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరిగే సమయంలో రైతుల వివరాలు ఆన్లైన్లో చూపించని ఎడల వ్యవసాయ మార్కెట్ ములుగు నందు తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఊరట పొందేది. ఈసారి ఆ వెసులుబాటు లేదు.
పంట నమోదు చేసుకొని ఎడల పంట కొనుగోలు సమయంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఆన్లైన్లో నమోదు కాని పంట ఉత్పత్తులను ప్రభుత్వము కొనుగోలు చేసే ఆస్కారం లేదు.కాగా రైతులు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అక్టోబర్ 10 లోగా వరి పండించే రైతులు, అక్టోబర్ 25 లోగా మిగతా పంటలు పండించే రైతులు అందరూ తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని తెలిపారు.
