ప్రకృతి సేద్యం పై రైతులు చూపాలి

  • రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సూచన
  • ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
  • రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ
  • దుబ్బాక డివిజన్ ఏడిఏ కాంపాటి మల్లయ్య

ప్రకృతి సేద్యం పై రైతులు చూపాలి

సిద్దిపేట:

నేటి సమాజంలో రైతులు అవసరానికి మించి పంట పొలాల్లో రసాయన ఎరువులు వాడుతున్నారని తద్వారా పర్యావరణం కలుషితమై అనారోగ్యాలకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయని, వాటిని అధిగమించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే పరిష్కారమన్నారు దుబ్బాక డివిజన్ ఏ.డి.ఏ కాంపాటి మల్లయ్య. రైతులు ప్రకృతి వ్యవసాయం పై ఆసక్తి పెంచుకొని రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక రైతు వేదికలో ప్రకృతి సేద్యంపై హైదరాబాద్ కమిషనరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల  నాగేశ్వరావు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడారు.రైతులు సహజసిద్ధ పద్ధతులను అనుసరించి ప్రకృతిలో లభించే వనరులను వినియోగించి పంటలను పండించాలని సూచించారు. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ఉత్పత్తి కోసం ప్రకృతి సేద్యం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకు పంటల సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై సలహాలు, సూచనలు అందించారు. పంటల్లో వచ్చే చీడపీడల నివారణకు సహజసిద్ధమైన పద్ధతులు, పశువుల ఎరువులు, జీవామృతం వంటి వాటిని ఉపయోగించాలని సూచించారు. అలాగే రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని కోరారు.అనంతరం 
దుబ్బాక డివిజన్ ఏ.డి.ఏ కాంపాటి మల్లయ్య మాట్లాడుతూ, రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని అన్నారు. విచక్షణ రహితంగా పురుగుమందుల వినియోగం పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రేణుక, నరేష్, మనోజ్ఞ, సంధ్యతో పాటు దుబ్బాక ఎఫ్‌పీవో చైర్మన్ తీపిరెడ్డి రంగారెడ్డి, సీఈవో భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు అశోక్, నారాయణ, కనకయ్య, సాయిలు, సైదుగారి అనిల్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-03-17 at 19.49.16

About The Author