ఉద్యాన పంటల సాగు వైపు రైతులు అడుగులు వేయాలి

- క్షీరసాగర్లో కూరగాయల సాగుపై రైతులకు అవగాహన 
- సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తాం 
- తక్కువ మోతాదులో రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించాలి 
- విశ్వవిద్యాలయం ఉపకులపతి డా..దండ రాజిరెడ్డి

ఉద్యాన పంటల సాగు వైపు రైతులు అడుగులు వేయాలి

సిద్దిపేట:

ఉద్యాన పంటల సాగు వైపు రైతులు అడుగులు వేయాలని పంటల సాగు విధానానికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తాని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా..దండ రాజిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని క్షీరసాగర్ గ్రామపంచాయతీలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం  రైతు సదస్సు నిర్వహించారు. విశ్వవిద్యాలయం పరిధిలోని మొజెర్ల కళాశాల హార్టికల్చర్ తుది సంవత్సరం విద్యార్థులు గ్రామీణ ఉద్యాన పనుల అనుభవ కార్యక్రమం (RHWEP)లో భాగంగా ఈ కార్యక్రమాన్ని జరగగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ సహకారంతో కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. దండ రాజిరెడ్డి హాజరై ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కొన్యాల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో సదస్సు కొనసాగించారు.ఈ సందర్భంగా విద్యార్థులు రైతుల సాగు పద్ధతులు, పంటల నమూనాలను అధ్యయనం చేసి తక్కువ మోతాదులో రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించాలని సూచించారు. కోల్డ్ స్టోరేజ్, అగ్రి వోల్టాయిక్ వ్యవస్థ, మల్చింగ్ విధానం, వివిధ కూరగాయల హైబ్రిడ్ రకాలపై ప్రదర్శనలు నిర్వహించారు. మొజెర్ల RHWEP విద్యార్థినులు పురుగుమందుల పిచికారీ సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు, వ్యవసాయ రసాయనాల లేబుళ్లు, వాటి ఆరోగ్య ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మోనో యాక్టింగ్, నృత్యాలతో రైతులను ఆకట్టుకుంటూ ఉద్యాన పంటల సాగు వైపు ప్రోత్సహించారు.ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఉపకులపతి డా. దండ రాజిరెడ్డి  ప్రసంగించారు. క్షీరసాగర్ గ్రామాన్ని విశ్వవిద్యాలయం దత్తత తీసుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడం, నేల పరీక్షలు నిర్వహించడం, వ్యవసాయ మరియు ఉద్యాన శాఖలతో కలిసి టెక్నాలజీ సెంటర్ స్థాపన చేయనున్నట్లు తెలిపారు.అనంతరం సర్పంచ్ కొన్యాల బాల్ రెడ్డి మాట్లాడుతూ క్షీరసాగర్ గ్రామాన్ని కూరగాయల సాగులో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చాలని, రైతుల ప్రయోజనార్థం రైతు వేదికను ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డా. టి. సురేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. డి. లక్ష్మీనారాయణ, ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ వి. సుచిత్ర, ఎంపీడీవో మీరా స్వర్ణకుమారి, వైస్ సర్పంచ్ నల్ల నరేష్, మాజీ సర్పంచులు కాయితి యాదమ్మ, కాయితి నర్సింహరావు, మతాల వెంకటేష్ గౌడ్, ఉద్యాన యూనివర్సిటీ అధ్యాపకులు సతీష్, సింధుజ, రాజశేఖర్, గ్రామ రైతులు, విద్యార్థినులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-09 at 19.39.30 (1)

About The Author