మల్లికార్జున ఖర్గేపై బీజేపీ మాజీ కార్పొరేటర్ ఫిర్యాదు
ఎల్బీనగర్:
సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలపై సరూర్ నగర్ మాజీ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఫిర్యాదు చేశారు.ఒక సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే
బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై “చంపాలి” వంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యానికి ముప్పు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌పై బిల్లు తీసుకువస్తామని చెప్పి, తమ సొంత పార్టీ నాయకుల విషయంలో మౌనం పాటించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం.ఆ మౌనం కూడా తప్పుతో సమానమేనని ఆమె అన్నారు.ఇలాంటి వ్యాఖ్యలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
About The Author
10 Apr 2026
