అంబేత్కర్ ని ఆదర్శంగా తీసుకొని యువత అభివృద్ధి చెందాలి మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు
భారతశక్తి:
కాప్రా సర్కిలో ని సాయి నగర్,పద్మ శాలి టౌన్ షిప్ ల్లో అంబేద్కర్ పుట్టినరోజు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కాప్రా డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు విచ్చేసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్త రామారావు మాట్లాడుతూ నేటి యువత అంబేత్కర్ ని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందాలని కోరారు.భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేత్కర్ సేవలు చిరస్మరణీయం అని రామారావు కొనియాడారు.ఇప్పుడు బి.సి,ఏస్.సి,ఏస్.టి రిజర్వేషన్లు పొందుతున్నామంటే అంబేత్కర్ పుణ్యమే అని రామారావు వివరించారు.దళిత, బీద,బలహీన వర్గాల అభ్యన్నతికి నిరంతరం కృషి చేసిన ఆశా జ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేత్కర్ భారతీయ ప్రజలకు చేసిన సేవవలు బావితరనికి తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత గా గుర్తుంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ సంఘం మేడ్చల్ జిల్లా కోశాధికారి బర్ల భిక్షపతి ముదిరాజ్ కోరారు.
ఈకార్యక్రమంలో నవీన్ గౌడ్ భిక్షపతి ముదిరాజ్ అంబేత్కర్ సంఘం అధ్యక్షుడు జోగరావు,సాయి నగర్ కాలనీ అధ్యక్షుడు రాజు,గజేందర్,శ్రీదేవి పలువురు పాల్గొన్నారు.
