ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

  •  గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ
  •   ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం
  •  సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ రావు 

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

సిద్దిపేట:

ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని బొప్పాపూర్ గ్రామ సర్పంచ్  మాధవనేని భాను ప్రసాద్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల సమస్యకు పరిష్కారం లభించింది.ఆదివారం గ్రామ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ రావు ఆధ్వర్యంలో నలుగురు లబ్ధిదారులైన  గవ్వల మమత, దుంపలపల్లి కల్పన, బొట్ల వజ్రవ్వ, ఈదుగల్ల బాబుల ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా గ్రామసర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు ఉన్నప్పటికీ, లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ గత ఏడాది కాలంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేకపోయారు. ఈ సమస్యను గమనించిన సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ స్వయంగా ముందుకు వచ్చి, తన స్నేహితుల సహకారులతో కలిసి కేటాయించిన బడ్జెట్‌లోనే ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంతో లబ్ధిదారులలో ఆనందం వెల్లివిరిసిందన్నారు. వారి సొంత ఇంటి కల నెరవేరే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోనాపురం పద్మ , వార్డు సభ్యులు బండమీది క్రాంతి, పర్స పర్షరాములు, గవ్వల బుజ్జి, సీనియర్ నాయకులు అరిగే కృష్ణ, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author