ప్రజా సమస్యలపై పూర్తి దృష్టి పెట్టాలి

- జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య 
- ప్రజావాణికి 76 దరఖాస్తులు

WhatsApp Image 2025-11-24 at 5.11.19 PM

సంగారెడ్డి : 

జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య  సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 76 దరఖాస్తుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి అర్జీపై తక్షణ చర్యలు తీసుకొని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు .అలాగే ప్రజల ప్రాధాన్య సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ , మాధురి డి.ఆర్.ఓ పద్మజ రాణి సంబంధిత శాఖల అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

About The Author